హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్తకుప్పగా మారిన ఎమ్మిగనూరు చారిత్రక బావి

KRNL: ఎమ్మిగనూరు శ్రీనివాస్ కూడలిలోని చారిత్రక పురాతన బావి నేడు చెత్తాచెదారంతో నిండిపోయి నిరాదరణకు గురైంది. ఒకప్పుడు ఊరంతా దాహం తీర్చిన ఈ బావి ప్రస్తుతం పూడుకుపోయి దుస్థితికి చేరింది. బావిని పునరుద్ధరించి పార్కుగా అభివృద్ధి చేస్తే చారిత్రక గుర్తింపు నిలుస్తుందని ప్రజలు కోరుతున్నారు. నాయకులు, అధికారులు చొరవ తీసుకుని బావికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.