హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

AKP: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP తుహిన్ సిన్హా తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.