హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండలంలో 144 సెక్షన్ అమలు: సీఐ

ATP: గుత్తి మండలంలో రేపు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని సీఐ  ధరణి కిషోర్ శనివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గొడవలు, దాడులు, బెదిరింపులు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు హెచ్చరించారు. మండలంలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.