హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.5 వేల నగదు బ్యాగు అప్పగింత

MBNR: జడ్చర్ల బస్టాండ్‌లో మర్చిపోయిన రూ.5 వేల నగదు ఉన్న బ్యాగును ఆర్టీసీ సిబ్బంది గుర్తించి ప్రయాణికురాలు జమునకు సురక్షితంగా అప్పగించారు. HYD నుంచి MBNR వెళ్తున్న ఆమె బ్యాగును బస్టాండ్‌లో మర్చిపోయారు. స్టేషన్ మేనేజర్ జయరాజ్, కంట్రోలర్ జి.ఎల్.గౌడ్, కండక్టర్ తిరుపతయ్య, సెక్యూరిటీ సిబ్బంది లింగంపేట నర్సింహులు నిజాయితీ చాటుకుని అభినందనలు అందుకున్నారు.