హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ వాల్‌పేపర్ (APK) యాప్‌ల పట్ల జాగ్రత్త

HYD: సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వచ్చే నకిలీ వాల్‌పేపర్ (APK) యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు. వీటిని ఇన్‌స్టాల్ చేసి అనుమతులిస్తే, ఓటీపీ చెప్పకపోయినా ఫోన్ హ్యాక్ అయి డబ్బులు పోతాయని తెలిపారు.అధికారిక యాప్ స్టోర్లనే వాడాలని, మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.