KRNL: మంత్రాలయం మండలంలో ఆదివారం జరగనున్న ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు DSP శ్రీనివాస్ తెలిపారు. 8 మంది సీఐలు, 10 మంది ఎస్సైలు, 150 మంది పోలీసులను విధులకు కేటాయించారు. పరిమళ పాఠశాలలో పోలీసులకు ఎన్నికల విధులపై అవగాహన కల్పించి, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో గొడవలు సృష్టిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో పటిష్ఠ పోలీస్ బందోబస్తు


