ELR: కొయ్యలగూడెం మండలం సీతంపేట నుంచి తిరుమలపురం వరకు చేపడుతున్న తారు రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందంటూ స్థానికులు పనులను అడ్డుకున్నారు. తారు పొర అర అంగుళం కూడా లేదని, ఇంత పలుచగా రోడ్డు వేస్తే ఎక్కువ రోజులు మన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలతో రోడ్డు వేయాలని, నాసిరకంగా నిర్మిస్తున్న రోడ్డు తమకు వద్దంటూ నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు నాణ్యతపై స్థానికుల ఆగ్రహం


