హైదరాబాద్: 28°C
వార్తలు

లోయలో పడ్డ కారు.. 8 మంది మృతి

ఉత్తరాఖండ్ పౌరీ గర్వాల్ జిల్లా లాన్స్‌డౌన్ పరిధి రిఖ్నిఖాల్‌లోని కల్వాడి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు 200-300 మీటర్ల లోయలో పడటంతో ఆరుగురు మహిళలు, డ్రైవర్ సహా 8 మంది మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరణించిన మహిళలు స్వయం సహాయక సంఘం సభ్యులని పేర్కొన్నారు.