హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి విడుదలపై చిరుమర్తి అసంతృప్తి

NLG: నార్కట్‌పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. సాగర్ ఎడమ కాలువ, వరద కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్న ప్రభుత్వం, ఏఎంఆర్పీ పరిధిలోని చెరువులు, కుంటలను ఎందుకు నింపడం లేదని ఆయన ప్రశ్నించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.