హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధ్యాహ్న భోజనంపై కమిషన్ తనిఖీ

SRPT: గురుకుల, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు సరిత ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.