హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌పై సమీక్ష

డెన్మార్క్ మంత్రి లార్స్ లోక్కే రాస్ముస్సెన్‌తో జాయింట్ కమిషన్ భేటీకి సహ-అధ్యక్షత వహించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. నీరు, షిప్పింగ్, పునరుత్పాదక ఇంధనంలో భారత్-డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ను సమీక్షించామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, భద్రత అంశాలపై చర్చించి, భారత్-డెన్మార్క్-ఈయూ బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నామన్నారు.