తమిళనాడు తిరుప్పరంకుండ్రం కొండపై సా. 5 గంటలకు కార్తీక దీపం వెలిగించేందుకు 30 కిలోల నెయ్యి, 50 మీ. ఖాదీ వస్త్రం, 5 కిలోల కర్పూరం, మట్టి కుండలు చేరాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు వేలాదిగా వచ్చిన భక్తులు కొండపైకి పంపాలని వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మదురై ఎస్పీ భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించారు.
వార్తలు
తిరుప్పరంకుండ్రం కార్తీక దీపానికి సర్వం సిద్ధం


