హైదరాబాద్: 28°C
తెలంగాణ

చైతన్య కుమారికి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ పురస్కారం

మంచిర్యాల జిల్లాకు చెందిన తౌటం చైతన్య కుమారి ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ పురస్కారాన్ని పొందింది. శనివారం జరిగిన కేయూ 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమెకు పురస్కారం అందజేశారు. రాజకీయ శాస్త్ర విభాగంలో గిరిజన సంక్షేమం, విద్య అంశాలపై చేసిన పరిశోధనకు పురస్కారం లభించినట్లు చైతన్య కుమారి తెలిపారు.