MHBD: మరిపెడ మండలం వెంకట్యాతండాకు చెందిన ఆశా కార్యకర్త గుగులోతు భార్గవి శనివారం జీతం అందకపోవడంతో నిరసన తెలుపుతూ పారాసిటమాల్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రెండో రోజు కొనసాగుతున్న నిరసనలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన డాక్టర్ పూజిత, వైద్య సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స అందించి మాత్రలను బయటకు తీయించారు.
తెలంగాణ
VIDEO: జీతం రాక ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం


