హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని ఉప సంహరించుకోవాలి'

NTR: కంచికచర్ల వద్ద ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. నక్కలంపేట నుంచి గాజులపేట వరకు ఆరు లైన్ల రహదారితో 10 గ్రామాలు వరద ముంపు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘాల నాయకులు, బాధిత రైతులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.