హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కైలాసగిరి కొండపై ప్రమాదం.. లోకేష్ ఆరా..!

విశాఖ కైలాసగిరి కొండపై జరిగిన పాఠశాల బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. విహారయాత్రల సమయంలో పిల్లల భద్రతకు పాఠశాల యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి స్పష్టం చేశారు.