హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి భారీ చోరీ కేసును పోలీసులు 10 రోజుల్లో ఛేదించారు. తెలంగాణ, APలో 94 దొంగతనం కేసుల్లో నిందితుడైన పోలాకి అప్పలనాయుడు (47)ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.92 లక్షల విలువైన 654 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.9.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.