హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూలే వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి

PLD: చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో శనివారం టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే వర్ధంతి వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు నేటికీ ప్రజలను చైతన్యపరుస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.