హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దు'

W.G: వివాహాలను ప్రోత్సహిస్తే బాలికల బంగారు భవిష్యత్తు చేజేతులా నాశనం చేసిన వారమవుతామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి డి వాణి విజయ రత్నం అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి శనివారం కాళ్ల కూడలిలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆడ పిల్లలకు 'చదువే ముద్దు- బాల్య వివాహాలు వద్దు' అంటూ నినాదాలు చేశారు