W.G: భీమవరం త్యాగరాజ భవనంలో మానవత సంస్థ నెలవారీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి SSN రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి CI రమేష్ మాట్లాడుతూ.. మానవత సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. యువతను సంస్థలో సభ్యులుగా చేర్చి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు. ఈ సమావేశంలో KNM బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మానవత కార్యక్రమాలు సమాజానికి ఉపయోగ పడుతున్నాయి'


