NZతో రెండో టెస్టులో పంత్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఔట్ కావడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే పంత్కు మద్దతుగా నిలిచాడు. పంత్ విలక్షణమైన ఆటగాడని, తన దూకుడుతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతాడని చెప్పాడు. 'అది కొన్నిసార్లు ఫలించకపోవచ్చు. అంతమాత్రాన విమర్శించడం సరికాదు' అని చెప్పాడు.
క్రీడలు
పంత్కు టీమిండియా కోచ్ మద్దతు


