ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదైంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్లో ట్రయన్ 16 బంతుల్లోనే అర్ధశతకం బాది ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్న ఆమె.. మెల్‌బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె మొత్తం 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
క్రీడలు
WBBL చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ 50


