హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భట్టువారిపల్లెలో అలరించిన దుర్యోధన వధ

CTR: సదుం మండలంలోని భట్టువారిపల్లె భారతం మిట్ట వద్ద పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞంలో భాగంగా శనివారం ప్రదర్శించిన దుర్యోధన వధ ఘట్టం విశేషంగా అలరించింది. మధ్యాహ్నం భాగవతారణి జ్యోత్స్న ఆధ్వర్యంలో హరికథ కాలక్షేపం నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర నాటక మండలి సభ్యులు దుర్యోధన వధను నిర్వహించారు.