హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

18 గ్రామాల్లో పర్యటించిన నూతన సర్పంచ్

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ నూతన సర్పంచ్‌గా కూటమి (జనసేన, టీడీపీ, బీజేపీ) తరఫున ఎన్నికైన గుంట కోటేశ్వరరావు 18 గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తన విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.