హైదరాబాద్: 28°C
తెలంగాణ

366 జంటలతో సత్యనారాయణ వ్రతాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 366 జంటలతో వేద పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 366 జంటలతో సత్యనారాయణ వ్రతాన్ని చేయించారు.