హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన ప్రారంభం

TPT: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను శనివారం ప్రారంభించారు. అలంకార మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. భక్తులు ఈ అర్చనల్లో పాల్గొనాలని దేవస్థానం అధికారులు కోరారు.