E.G: అస్సాంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన BSF జవాన్ వేణు మృతదేహం గోకవరం మండలం కొత్తపల్లికి చేరుకుంది. అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించారు. BSF కమాండోలు గౌరవ వందనం సమర్పించారు. వేణు భార్యకు జాతీయ జెండాను అందజేసి అధికారులు సెల్యూట్ చేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంతిమయాత్రలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఆంధ్రప్రదేశ్
స్వగ్రామానికి చేరుకున్న జవాన్ మృతదేహం


