హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రీసర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి'

సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్ శనివారం నడిగూడెం మండలంలో పర్యటించి, గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించారు. పనులను నిర్దేశిత సమయంలో పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు.