NRPT: సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మక్తల్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదయ్య, గోపాలం జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి126 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
మక్తల్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు


