హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతకు నివాళులర్పించిన బలసాని కిరణ్

గుంటూరు రూరల్ మండలం బొంతపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేత వలేటి రాఘవ మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. వలేటి రాఘవ భౌతికకాయానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి బలసాని కిరణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాఘవ కుటుంబ సభ్యులను బలసాని కిరణ్ కుమార్ పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.