హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

​బాపట్ల జిల్లాలో 103 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు జేసీ భావన వశిష్ఠ తెలిపారు. వేమూరు చావాలి గ్రామాల్లో పర్యటించి ధాన్యం సేకరణను పరిశీలించారు. 75 కేజీల గ్రేడ్-ఏ ధాన్యానికి రూ.1,846, కామన్ రకానికి రూ.1,831 మద్దతు ధర నిర్ణయించామన్నారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాలనే వినియోగించుకోవాలని, సంచులు, రవాణా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.