హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాప్తాడు బాలిక కోలుకుంటోంది: మంత్రి

ATP: రాప్తాడు ఘటనకు సంబంధించి బాధిత బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేష్ అప్ డేట్ ఇచ్చారు. 'చిన్నారి ఆరోగ్యం మెరుగుపడుతూ క్రమంగా కోలుకుంటోందని తెలియజేయడం సంతోషంగా ఉంది. గాయాలకు కట్టిన బ్యాండేజీలను చాలావరకు వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతోంది. సెషన్ల సమయంలో ఎడమ చేతిలో కొంత వాపు, నొప్పి ఉన్నాయి. త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు.