TPT: వెంకటగిరి పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్ పర్సన్ దొంతు శారదకు 9వ వార్డు కౌన్సిలర్ తేజస్విని వినతి పత్రం అందించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. 9వ వార్డులోని 4వ వీధిలో సర్వేనెంబర్ 115/1లో ఉన్న ప్రభుత్వ స్థలంలో చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలాలను కాపాడి, ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
9వ వార్డులో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు కౌన్సిలర్ వినతి


