ASR: డుంబ్రిగూడ మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను ఎస్ఎంసీ ఛైర్మన్ గుజ్జెల రమేష్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. భోజన వసతులు, గదుల పరిశుభ్రత, పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆశ్రమ బాలికల పాఠశాలలో ఎస్ఎంసీ ఛైర్మన్ తనిఖీ


