MDK: జాతీయ రహదారి 765 డీజీ విస్తరణకు సంబంధించి పెండింగ్ భూసేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శనివారం రెవెన్యూ, జాతీయ రహదారుల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. రైతులకు పరిహారం త్వరగా అందించి, హద్దుల సమస్యలు పరిష్కరించి భూమిని అప్పగించాలన్నారు. ఇందులో ఈఈ సురేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
తెలంగాణ
NH-765 DG భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్


