హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం రిఫైనరీకి బీపీసీఎల్ గ్రీన్ సిగ్నల్!

ప్రకాశం: రామాయపట్నంలో భారీ రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ ఆమోదం తెలిపిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రిఫైనరీ ఏర్పాటుతో దేశ ఇంధన భద్రతకు తోడ్పాటు లభించడంతో పాటు, దక్షిణాంధ్ర అభివృద్ధికి కీలక ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.