హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తచెరువులో పోలింగ్ సామాగ్రి పంపిణీ

సత్యసాయి: జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం కొత్తచెరువు మండల కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రిని సరిచూసుకున్న సిబ్బంది పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.