హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో మిస్టరీ పోస్టర్ల కలకలం

గుంటూరు జీజీహెచ్ పరిసరాల్లో వెలిసిన వింత పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. 'పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా?' అనే వ్యాఖ్యతో, మనిషి శరీరానికి వరాహం ముఖంతో రూపొందించిన పోస్టర్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ అని వస్తోంది. ఈ మిస్టరీ పోస్టర్ల వెనుక ఎవరున్నారనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.