హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్: హరీష్ రావు

SDPT: ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచించారు. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆశలు, కుటుంబ కలలు నెరవేరాలని ఆకాంక్షించారు. మీ కలల కోసం చేసిన పోరాటానికి రేపటి పరీక్ష తొలి విజయ సంకేతం కావాలని ఆయన కోరుకున్నారు.