హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్దిని దర్శించుకున్న హాస్యనటుడు గౌతమ్‌రాజు

ELR: కార్తీక శనివారం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం 8 గంటలకు అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల ద్వారా రూ.4,35,450 ఆదాయం సమకూరింది. సుమారు 4,300 మంది భక్తులకు అన్నదానం చేశారు. హాస్యనటుడు గౌతమ్‌రాజు స్వామిని దర్శించుకున్నారు.