హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై డిసెంబర్ 30 నుంచి భవానీ దీక్షల విరమణ

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు భవానీ మండల దీక్షల విరమణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 30న అగ్నిప్రతిష్ఠాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతాయని ఈవో శీనా నాయక్ తెలిపారు. జనవరి 3న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. భవానీల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వివరాలకు 1800 425 9099ను సంప్రదించాలన్నారు.