హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెంచిన మున్సిపల్ పన్నులు తగ్గించాలి: బీజేపీ

ములుగు మున్సిపాలిటీలో పెంచిన ఇంటి, వ్యాపార, విద్యాసంస్థల పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. డిసెంబర్ 2నుంచి గడపగడపకు వెళ్లి పన్నుల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ, సంతకాల సేకరణ చేపడతామన్నారు. భువన్ సర్వే పేరుతో కొలతలు నిలిపివేయాలన్నారు.