హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్ బిల్లు.. అమిత్ షా కీలక విజ్ఞప్తి

ఎన్నికల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు బీజేపీ సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'X' వేదికగా మరోసారి స్పష్టం చేశారు. 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే ఈ లక్ష్యం కార్యరూపం దాల్చుతుందన్నారు. కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుతో సుపరిపాలన, ప్రజా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతాయని చెప్పారు. దానికి రాజకీయ పార్టీలన్నీ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.