హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన కొమరగిరిపట్నం సర్పంచ్

కోనసీమ: అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామ సర్పంచ్ పిండి మాచరయ్య, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాచరయ్యతో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. మెట్ల రమణబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.