W.G: ఆకివీడు మండలంలోని పలు గ్రామాల్లోని గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తయి అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 16 గ్రామాలకు 5 గ్రామాలు ఏకగ్రీవం కాగా, 11 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. సమయం తక్కువగా ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో అభ్యర్థుల ముమ్మర ప్రచారం


