ASR: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,443 మందికి 1,190మంది హాజరయ్యారు. 82 శాతం హాజరు నమోదైంది. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ నిశాంతి తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నవోదయ పరీక్ష.. 82 శాతం హాజరు


