కడప జిల్లాలో రేపు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలోని 13 మండలాల్లో 89 సర్పంచ్, 834 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 1,61,841 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 894 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్


