హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాజీ బీడీ కార్మికుల ఆందోళనకు చర్చలు

నిర్మల్ జిల్లాలో శివాజీ బీడీ కార్మికుల ఆందోళనకు యాజమాన్యం స్పందించింది. ఈ నెల 9 నుంచి కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో శనివారం లేబర్ ఆఫీసులో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డి సమక్షంలో యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. కార్మికుల సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు తెలిసింది.