హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయపడిన టీడీపీ కార్యకర్తలకు సునీత పరామర్శ

ATP: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు మండలం బి.యాలేరు, తోపుదుర్తి గ్రామాల్లో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పూజారి ఈశ్వరయ్య, ప్రసాద్, జి.ఓబిలేసు, జి.ఈశ్వరయ్య, దాసరి వెంకటరాముడు, లక్ష్మీదేవిలను కలిశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.