హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే భోజనం

సత్యసాయి: ​మడకశిర నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్‌ను శనివారం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు సందర్శించి, సామాన్యులతో కలిసి భోజనం చేశారు. వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం నిరంతరాయంగా అందించాలని, నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.